మొగళ్లపాళెం గిరిజన కాలనీలో “జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి బాట”

Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న “జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. 24వ రోజైన బుధవారం సౌత్ మోపూరు గ్రామ పరిధిలోని మొగళ్లపాళెం గిరిజన కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అనంతరం స్థానికులతో సమావేశమయ్యి ప్రసంగించారు. సౌత్ మోపూరులో ఇప్పటి వరకూ 10.11 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 5.54 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

Read Previous

గుర్తు పట్ట లేదా ? – ఈయనే కిరణ్ కుమార్

Read Next

బడుగులపై పిడుగు… దొరవారి సత్రంలో బాలుడు మృత్యువాత

Leave a Reply

Your email address will not be published.