పోలీసు శాఖలో బదిలీలు : నెల్లూరుజిల్లాకు ఇద్దరు రాక, ఇద్దరు పోక

Clock Of Nellore ( Nellore ) – పోలీసు శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పదోన్నతి పొందిన అదనపు ఎస్పీలకు కొత్తగా పోస్టింగ్ లు ఇవ్వడంతో పాటూ వివిధ పోస్టుల్లో ఉన్న అదనపు ఎస్పీలను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. నెల్లూరుజిల్లా అదనపు ఎస్పీ ( అడ్మిన్ ) పి. వెంకటరత్నంను విజయవాడ సిటీ నేర విభాగం అదనపు డిసిపిగా బదిలీ చేసింది. ఆ స్థానంలో బాపట్ల అదనపు ఎస్పీగా ఉన్న డి. హిమవతిని నియమించారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది కావలి డిఎస్పీగా కొనసాగుతున్న దేవరకొండ ప్రసాద్ ను… కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా బదిలీ చేసింది. పోస్టింగ్ వెయిటింగ్ ఉన్న కె. చౌడేశ్వరిని నెల్లూరుజిల్లా నేర విభాగం అదనపు ఎస్పీగా నియమించింది. చౌడేశ్వరి గతంలో ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని గూడూరు డిఎస్పీగా పనిచేశారు.

Read Previous

సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదుపులోనే ఆస్థమా : డాక్టర్ సుస్మితా రెడ్డి వెల్లడి

Read Next

పండగ పూట నెల్లూరులో విషాదం… తమ్ముడ్ని హత్య చేసిన అన్న

Leave a Reply

Your email address will not be published.