సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదుపులోనే ఆస్థమా : డాక్టర్ సుస్మితా రెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – కొన్ని సందర్భాల్లో ఆస్థమా ప్రాణాపాయంగా మారుతుందని, వైద్యుల సలహా మేరకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆస్థమా అదుపులో ఉండి సుఖప్రదమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చునని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలు డాక్టర్ జి.ఎల్. సుస్మితా రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆస్థమా దినోత్సవం సందర్బంగా హాస్పిటల్ లో ఆమె అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి వ్యాధి లక్షణాలు, దాని వల్ల కలిగే అనర్ధాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థలో సంభవించే మార్పుల కారణంగా ఊపిరితిత్తుల్లో అలర్జీ ఏర్పడటం మూలంగా ఆస్ధమా వ్యాధి సోకుతుందని చెప్పారు. వయస్సుతో సంభందం లేకుండా ఈ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశం ఉందన్నారు.

పొగా త్రాగే అలవాటు ఉండటం, దుమ్ము, ధూళి, కాలుష్యం, వాతావరణంలో మార్పుల కారణంగా ఆస్థమా పెరిగే అవకాశం ఉందని వివరించారు. కొంత మందిలో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఆస్థమా సోకే ప్రమాదం ఉందని డాక్టర్ సుస్మితా రెడ్డి తెలియజేశారు. ఆస్థమా ప్రభావం పెరిగినప్పుడు తరచూ కళ్లల్లో, ముక్కలో నుంచి నీరు కారడం, దగ్గు, కఫం రావడం, ఛాతి బిగువుగా ఉండటం లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి పి.ఎఫ్.టి పరీక్ష చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలన్నారు. మందులు వాడటం, వ్యాధి తీవ్రతను బట్టి రిలీవర్ ఇన్హేలర్, కంట్రోలర్ ఇన్హేలర్ వాడాల్సి ఉందని పేర్కొన్నారు. పొగ త్రాగడం మానేయాలని, దుమ్ము, ధూళి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాస్కు ధరించాలని, బరువు తగ్గాలని, వ్యాయామం, బ్రీతింగ్ కు సంభందించిన వ్యాయామాలు చేయాలన్నారు. ఆస్థమాతో బాధపడే వారు న్యూ మోకొకల్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకోవాలని డాక్టర్ సుస్మితా రెడ్డి స్పష్టం చేశారు. వైద్యుల సలహాలు పాటిస్తూ, మందులు వాడుకుంటే సుఖప్రదమైన జీవితాన్ని గడపవచ్చునన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ మాట్లాడుతూ ప్రపంచ ఆస్థమా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్ లో ఆస్థమా ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. కేవలం వెయ్యి రూపాయలకే 6 రకాల ఆస్థమా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు, ఆస్థమా రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read Previous

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కాకాణి – ముస్లింలతో కలిసి ప్రార్ధనలు

Read Next

పోలీసు శాఖలో బదిలీలు : నెల్లూరుజిల్లాకు ఇద్దరు రాక, ఇద్దరు పోక

One Comment

  • Ma’am iam getting more cough when cough chest pain before 9 years I had taken treatment for tb now I got so many hospitals but no relief
    Any suggestions ma’am

Leave a Reply

Your email address will not be published.