
Clock Of Nellore ( Nellore ) – రంజాన్ పర్వదినం రోజున నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం వరకూ రంజాన్ ప్రార్ధనల్లో ఉన్న ఇద్దరు సోదరులు రాత్రి కల్లా శత్రువులుగా మారారు. తమ్ముణ్ని అన్న హతమార్చాడు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీ టిడ్కో ఇళ్ల వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. జాఫర్ అనే వ్యక్తి తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు కొంత మంది గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిముషాల వ్యవధిలోనే తమ్ముడు కన్నుమూశాడు. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంభందాల కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు చెబుతున్నారు.