Clock Of Nellore ( Udayagiri ) – నెల్లూరుజిల్లా ఉదయగిరి మండలం, దాసరపల్లి గ్రామంలోకి చుక్కల దుప్పి దారి తప్పి వచ్చింది. సమీప అటవీ ప్రాంతంలో తాగునీటి కోసం వెదుకులాడుతూ దారితప్పి గ్రామంలోకి రాగా కుక్కలు వెంబడించి దాడి చేశాయి. దీంతో దుప్పి ఓ ఇంట్లోకి చొరబడింది. గమనించిన స్థానికులు దాన్ని కాపాడి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడకు చేరుకుని దుప్పిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.