జర్నీ మూవీ తరహాలో యాక్సిడెంట్ – ఇద్దరు డ్రైవర్లు మృతి

Clock Of Nellore ( Marripadu ) – వేగంగా ప్రయాణిస్తున్న రెండు ట్రావెల్ బస్సులు ఎదురెదురుగా ఢీకొని అనేక మంది చనిపోవడం, చనిపోయిన వారి జీవిత కథ వెనుక ఉన్న అనేక కోణాలను తెలియజేసే చిత్రం జర్నీ. ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇదంతా సినిమా. అయితే అదే సినిమా తరహాలో ప్రమాదం జరిగింది నెల్లూరుజిల్లాలో. కాకపోతే సినిమాలో బస్సులు ఉండగా… రియల్ సీన్ లో మాత్రం రెండు లారీలు ఢీ కొన్నాయి. మర్రిపాడు మండలం, చుంచులూరు సమీపంలో ఏర్పేడు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి రెండు లారీల క్యాబిన్ లో నుజ్జు నుజ్జు అయ్యి డ్రైవర్లు తీవ్ర గాయాలతో అందులోనే ఇరుక్కుపోయారు. హాహాకారాలు పెడుతుండగా కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్రేన్ సాయంతో రెండు లారీలను వేరు చేసిన పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ మృత్యువాత పడ్డారు.

Read Previous

గ్రేట్ ప్లేస్ టు వర్క్ ” మెడికవర్ ” : సర్టిఫికేట్ ప్రతిని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి

Read Next

మాజీ మంత్రి అనీల్ ఆరాధ్య నాయకుడు – కార్పొరేటర్ రామకృష్ణ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.