Clock Of Nellore ( Nellore ) – నిరుపేదలకు, అభాగ్యులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కనిపించే దేవుడని నెల్లూరు 47వ డివిజన్ కార్పోరేటర్ పొట్లూరి రామకృష్ణ తెలిపారు. సిఎం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది నిరుపేదలు, అభాగ్యులు, అక్కచెల్లెమ్మలు లబ్దిపొందుతున్నారని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గడప గడపకూ ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయని వివరించారు. అలాంటి వాంటీర్లను సన్మానించుకోవడం గర్వంగా ఉందన్నారు. 47వ డివజన్ పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లను సన్మానించిన ఆయన. వారిని అభినందించారు. అంతకు ముందు నవరత్నాలను, వాలంటీర్ల సేవలను, కార్పోరేటర్ రామకృష్ణ చేస్తున్న అభివృద్దిపనులను, ఎమ్మెల్యే అనీల్ సేవా కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన వీడియో విజువలైషన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తల్పగిరి రంగనాధుని ఆలయ చైర్మన్ శివకుమార్ ఆచారి, యువజన విభాగ అధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, శివపురం సురేష్ మరియు వైసిపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.