నెల్లూరుజిల్లా వైసీపిలో సమసిన వివాదం : మాజీ మంత్రితో తాజా మంత్రి భేటీ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా వైసీపిలో వివాదానికి తెరపడింది. తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ( Anil Kumar Yadav ) నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వివాదాలకు తావు లేదని తామంటా ఒక్కటేనని పరోక్షంగా స్పష్టం చేశారు. మంత్రి వర్గ మార్పుల నేపద్యంలో సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మంత్రి పదవిని కోల్పోగా, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి మండలిలో చోటు దక్కింది. ఆ సందర్భంగా ఇరువురు మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి సహకారం అందించారో అంతకు రెట్టింపు సహకారం కాకాణికి ఇస్తానని అనీల్ విలేకరులతో అన్నారు.

అంతే కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నెల్లూరుకు వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు నగరంలో అనేక మంది అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే నగర నియోజకవర్గంలో ఆ ఫ్లెక్సీలు మాయమయ్యాయి. తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డి నగరంలోని ఏసి సెంటర్ కు వచ్చిన సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా కొంత మంది తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపుతో వివాదం కాస్తా తారా స్థాయికి చేరింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని ఇద్దర్నీ తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. సమన్వయంతో పార్టీ కోసం పనిచేయాలని హితవు పలకడంతో అప్పటి నుండి మౌనంగా ఉన్నారు.

తాజాగా మంగళవారం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు ఇస్కాన్ సిటీలోని అనీల్ కుమార్ యాదవ్ నివాసానికి వెళ్లారు. అనీల్ కుమార్… మంత్రిని స్వాగతించి ఇంట్లోకి తీసుకెళ్లారు. మంత్రిని సత్కరించారు. అలాగే అనీల్ కు శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అరగంట పాటూ వారిద్దరూ చర్చించుకున్నారు. మొత్తానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… అనీల్ కుమార్ ఇంటికి వెళ్లి కలవడంతో ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయాయని భావిస్తున్నారు.

Read Previous

నెల్లూరు కోర్టులో చోరీ కేసు : మంత్రి కాకాణికి హైకోర్టు నోటీసులు

Read Next

నిరుపదేలకు వస్త్రాలు, పండ్లు : పంపిణీ చేసిన నయీమ్ ఖాన్

Leave a Reply

Your email address will not be published.