వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం : నెల్లూరుజిల్లాలో 3,52,755 మంది లబ్ధిదారులు

Clock Of Nellore ( Nellore ) – గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే సంకల్పంతో అక్క చెల్లెమ్మకు కానుకగా అందిస్తున్న వైయస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్చువల్ విధానం ద్వారా ఒంగోలు నుండి ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 9.76 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1261 కోట్ల వడ్డీని పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుండి ఈ వీడియో కాన్ఫెరెన్సుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ట్రైనీ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, డి.ఆర్.డి.ఏ పి.డి సాంబ శివారెడ్డి, మెప్మా పి.డి రవీంద్ర, స్యయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 36,059 గ్రామీణ సంఘాలలోని 3,52,755 మంది అక్కచెల్లెమ్మలకు వర్తించిన రూ.52,61,36,479/- ల వడ్డీ సాయం మెగా చెక్కును, అలాగే పట్టణ ప్రాంతాల్లోని 10, 261 సంఘాలలోని 1,02,389 మంది అక్కచెల్లెమ్మలకు వర్తించిన రూ.13,17,21,017/- ల వడ్డీ సాయం మెగా చెక్కును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర మేయర్ స్రవంతి తో కలసి పొదుపు సంఘాల సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పధకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పెద మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహద పడుతుందన్నారు. పేద మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పధకంను తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాల కార్యక్రమం ద్వారా వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పధకాన్ని ప్రారంభించి బ్యాంకుల నుండి రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాలు తిరిగి సకాలంలో చెల్లించిన అన్నీ సంఘాలకు ఈ పధకం కింద కట్టిన వడ్డీనీ తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమం జిల్లాలో మూడో విడత జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని 52,611 స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళ ఖాతాల్లో 77.35 కోట్ల రుపాయాలను జమచేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

Read Previous

వచ్చే నెల 11 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఆనం సమీక్ష

Read Next

కోటంరెడ్డి శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటారు… విపిఆర్ కితాబు

Leave a Reply

Your email address will not be published.