Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డి పాళెంలోని అరుంధతీయ వాడ ప్రాంతంలో రూ.53 లక్షలతో డ్రైన్ కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు వై.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అరుంధతీయ వాడలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టే క్రమంలో డ్రైనేజీ కాలువల నిర్మాణం ప్రారంభించమని తెలిపారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి పారిశుధ్య నిర్వహణను ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ ఛైర్మెన్ యేసు నాయుడు, వై.సి.పీ నాయకులు శ్రీనాద్, చిన్న బాబు, యేసయ్య, అనిల్, సునీత, భాస్కర్, రాజేష్, యోన తదితరులు పాల్గొన్నారు.
