Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసు విషయంలో ముమ్మర దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనపు ఎస్పీతో సహా ముగ్గురు సిఐలు, ఇద్దరు ఎస్సైలను నియమించినట్లు తెలియజేశారు. అన్నీ పోలీసు బృందాలు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాయని, అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ప్రకటించారు.