Clock Of Nellore ( Nellore Rural ) – జగనన్న మాట – గడప గడపకూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట ( KotamReddy Sridhar Reddy ) పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమం నిరాడంబరంగా సాగుతుంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రతీ కుటుంబాన్ని పలకరిస్తున్నారు. వారి కష్టాలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. కార్యకర్తల ఇళ్ల వద్దే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తున్నారు. రాత్రి బస కూడా కార్యకర్తల నివాసాల్లోనే. గత రాత్రి సజ్జాపురం గ్రామంలోని వెంకట రత్నం నివాసంలో బస చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… ఇవాళ ఉదయం కొత్త వెల్లంటి గ్రామానికి చేరుకున్నారు. ఇంటింటికి వెళ్లారు. వారితోనే కూర్చొని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుంటే అక్కడికక్కడే వాటి అమలుకు ఆదేశాలు ఇస్తున్నారు. మూడు నెలల పాటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇదే మాదిరిగా ప్రజల మధ్యనే ఉండనున్నారు.
