నెల్లూరు ఎస్పీకి జేజేలు పలికిన ఏఆర్ పోలీసులు.. సమసిన వివాదం

Clock Of Nellore ( Nellore ) – జిల్లాల విభజన నేపద్యంలో నెల్లూరుజిల్లాలోని ఏఆర్ పోలీసులను తిరుపతికి పంపించే విషయం వివాదంగా మారింది. కొందరు ఏఆర్ పోలీసులు విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ విజయరావు మొత్తం ఏఆర్ సిబ్బందితో నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాకు సిబ్బంది కేటాయింపుపై అనుసరిస్తున్న విధివిధానాలను వివరించారు. దీనిపై ఏఆర్ పోలీసులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎస్పీని తమ భుజాలపై ఎత్తుకుని హర్ష ద్వానాల మధ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వారు జాబితా తయారు చేస్తారని చెప్పారు. జాబితా తయారయ్యే వరకూ సిబ్బంది నెల్లూరులోనే ఉంటారన్నారు.

Read Previous

పురస్కారాలతో వాలంటీర్లకు ప్రోత్సాహం… వెల్లడించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి

Read Next

మాజీలైన తాజాలు… మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

Leave a Reply

Your email address will not be published.