Clock Of Nellore ( Manubolu ) – నెల్లూరుజిల్లా మనుబోలు మండలంలో ఆదివారం అర్ధరాత్రి స్వలంగా భూమి కంపించినట్లు ( Earthquake )అధికారులు తెలియజేశారు. మండలంలోని జట్ల కొండూరులో అర్ధరాత్రి ఒంటి గంట 10 నిముషాల సమయంలో భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలియజేశారు. అర్ధరాత్రి కావడం అందరూ నిద్రిస్తుండటం, భూ కంప తీవ్రత 3.6 గా ఉండటంతో అందరూ గుర్తించలేకపోయారు. భూ ప్రకంపనల కారణంగా ఎక్కడా ఎలాంటి ఉప ద్రవాలు తలెత్తలేదని అధికారులు స్పష్టం చేశారు.