వైసీపిలో చేరిన టిడిపి నేత… ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం సీనియర్ నేత షేక్ ఆసిఫ్ బాషా ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నెల్లూరులోని డైకస్ రోడ్డు సెంటర్ లో వందలాది మంది అనుచరులతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotamreddy Sridhar Reddy ) సమక్షంలో వైసీపి కండువా కప్పుకున్నారు. తనపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న ఆసిఫ్ బాషాకు ప్రాధాన్యత ఇస్తానని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. తాను ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తానని, మిగతా సమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, 32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్, వైసీపి నేతలు బెజవాడ మేఘనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న వామపక్షాలు… విద్యుత్ భవన్ ఎదుట ధర్నా

Read Next

నెల్లూరులో ముస్లింల సమరభేరి… ప్రభుత్వంపై సోమిరెడ్డి ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.