నెల్లూరులో ముస్లింల సమరభేరి… ప్రభుత్వంపై సోమిరెడ్డి ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులో ముస్లింలు సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపి ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలి, వారిపైనే కక్ష్య సాధింపు చర్యలు చేపట్టిందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో మైనార్టీలతో పాటూ ఇతర వర్గాలపై ప్రభుత్వం నేరపూరితంగా వ్యవహరిస్తుందని, దాని కారణంగా ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్, నగర టిడిపి ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read Previous

వైసీపిలో చేరిన టిడిపి నేత… ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

నెల్లూరు లాడ్జీలో యువతి ఆత్మహత్యాయత్నం… కాపాడిన 108 సిబ్బంది

Leave a Reply

Your email address will not be published.