ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు ఏర్పాట్లు – పరిశీలించిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీనా నెల్లూరు నగరానికి రానున్నారు. అదే రోజు కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొననున్నారు. సిఎం రాక నేపద్యంలో ఇవాళ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్, అధికారులు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ ను పరిశీలించారు. వాహనాల పార్కింగ్, సీటింగ్, భోజన సదుపాయం, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై వారు చర్చించుకున్నారు.

Read Previous

కోర్టు దిక్కరణ పిటిషన్లపై కలెక్టర్ సమీక్ష… అధికారుల తీరుపై ఆగ్రహం

Read Next

నెల్లూరు ఎస్-2 థియేటర్ లో ఆగిన RRR ప్రదర్శన… అభిమానుల ఆందోళన

Leave a Reply

Your email address will not be published.