Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. శనివారం రాత్రి మార్కెటింగ్ ఛైర్మైన్ వీరి చలపతి రావు, వ్యవసాయ సలహా బోర్డు ఛైర్మైన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి నెల్లూరులోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి విచ్చేసిన నల్లపరెడ్డి గిరిధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నకు తగ్గ తమ్ముడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపి బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారంటే అది వారి ప్రతిభను బట్టే ఇస్తారని ఆ సత్తా గిరిధర్ రెడ్డికి ఉందని ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు.