Clock Of Nellore ( Saidapuram ) – అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై అత్యాచార యత్నానికి ఒడిగడ్డారు దుండగులు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోగా దుండగులు పరారయ్యారు. వివరాల్లో కెళ్తే… బ్రిటన్ దేశానికి చెందిన 25 ఏళ్ల కరోలినా అనే యువతి కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చింది. ఈ క్రమంలో ఆ యువతి ఇవాళ మధ్యాహ్నం సైదాపురం సమీపంలోని రాపూరు రోడ్డులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అయితే ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్క ప్రాంతాల్లో ఉన్న వారు అక్కడకు వెళ్లగా దుండగులు పారిపోయినట్లు సమాచారం. దీంతో ఆ యువతిని సైదాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో వైపు ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించింది క్యాబ్ డ్రైవర్ అని అంటున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.