బుచ్చి టోల్ ప్లాజా వద్ద టెంటును ఢీ కొట్టిన లారీ… మహిళకు గాయాలు

Clock Of Nellore ( Buchi ) – నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డి పాళెం సమీపంలోని టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. టోల్ ప్లాజా పక్కన వాహనంలో వివిధ వస్తువులను విక్రయిస్తూ ఓ జంట అక్కడే టెంటు వేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం డ్రైవర్ లారీని రివర్స్ చేస్తుండగా అదపుతప్పి వెనుక నుండి లారీ టెంటుపైకి దూసుకెళ్లింది. టెంటు బయట కూర్చొని ఉన్న శోభ తీవ్రంగా గాయపడింది. టెంటు ధ్వంసమైంది. స్థానికులు హుటా హుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. శోభ కాళ్లకు తీవ్రంగా గాయాలయినట్లు పోలీసులు తెలియజేశారు.

Read Previous

రైలు కింద పడి విద్యార్ధిని ఆత్మహత్య… నెల్లూరుజిల్లాలో విషాదం

Read Next

నెల్లూరులో రేపు నారీ సంకల్ప దీక్ష… ఏర్పాట్లు పరిశీలించిన టిడిపి నేతలు

Leave a Reply

Your email address will not be published.