Clock Of Nellore ( Venkatagiri ) – పండుగ పూట సరదాగా ఈత కొడతామని తెలుగు గంగ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకుంది. పట్టణంలోని బంగారు పేటకు చెందిన మాతంగి ప్రతాప్ ( 16 ), సర్వేపల్లి బాలాజీ ( 13 ) అనే ఇద్దరు యువకులు మంగళవారం శివరాత్రి కావడంతో సమీపంలోని తెలుగు గంగ కాలువ వద్దకు వెళ్లారు. ఈత కొట్టేందుకు కాలువలోకి దిగగా కొద్ది సేపటికే వారిద్దరూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి కాలువలో గాలింపు చేపట్టారు.
