Clock Of Nellore ( Chillakuru ) – నెల్లూరుజిల్లాకు సరిహద్దు రాష్ట్రం తమిళనాడు సిఎం ఎమ్.కె. స్టాలిన్ కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరుజిల్లాకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్. స్వగ్రామమైన చిల్లకూరు మండలం, ఏరూరులో స్టాలిన్ సైకత శిల్పాన్ని రూపొందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. స్టాలిన్ నేతృత్వంతో తమిళనాడు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని సనత్ కుమార్ కాంక్షించారు.
