వాళ్ల బాధ్యత అంతా నాదే… జగనన్నమాట ముగింపు కార్యక్రమంలో కోటంరెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ, తాను రెండు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించడం వెనుక ఉన్న కార్యకర్తల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 65 రోజుల పాటూ నిర్వహించిన జగనన్న మాట – కార్యకర్తల ఇళ్లకు కోటంరెడ్డి బాట కార్యక్రమం ముగిసింది. చివరి రోజైన మంగళవారం 30వ డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ లోని ఓ కార్యకర్తతో మాట్లాడారు. అనంతరం అదే ప్రాంతంలో విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమం ముగిసినట్లు ప్రకటించారు. 65 రోజుల పాటూ నిర్వహించిన కార్యక్రమంలో తాను గమనించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

ఏ పార్టీకైనా నాయకుడికైనా కార్యకర్తలు, ప్రజలు రెండు కళ్లలాంటి వారని అన్నారు. కార్యకర్తల కళ్లలో వెలుగు, వారి కుటుంబంలో సంతోషం ఉండేనే ఆ నాయకులు పది కాలాల పాటూ ప్రజా జీవితంలో కొనసాగుతారని ఎమ్మెల్యే కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. 65 రోజుల్లో 5019 మంది కార్యకర్తల నివాసాలకు వెళ్లానని వారిలో 1072 మంది కార్యకర్తల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని తెలియజేశారు. అందుకే 400 మంది కార్యకర్తల కుటుంబాల పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటున్నానని, వాళ్లు చదివినంత కాలం ఆ కార్యకర్తల కుటుంబాలపై ఫీజుల బారం లేకుండా ఆ భారాన్ని తానే బరాయిస్తానని ప్రకటించారు. మరో 672 మంది కార్యకర్తల కుటుంబాల ఎదుగుదల కోసం తన వంతు సహకారం అందించానని కోటంరెడ్డి వెల్లడించారు. తనకు ప్రజలకు మధ్య వారధిలా నిలుస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం, వారి రాజకీయ గౌరవం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇద్దరు కార్యకర్తల పిల్లలు వారు సివిల్స్ చదవాలని కోరగా వారి కోచింగ్ బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ ముగింపు కార్యక్రమంలో నగర మేయర్ స్రవంతి, ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, మాజీ మేయర్ భానుశ్రీ, 30వ డివిజన్ కార్పొరేటర్ కూకాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

వైసీపి నిరంకుశ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లండి… గూడూరులో సోమిరెడ్డి పిలుపు

Read Next

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు…

Leave a Reply

Your email address will not be published.