ఏపీపీఎస్సీ ఛైర్మన్​గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ…

Clock Of Nellore ( Vijayawada ) – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్​గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్​గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఛాంబర్​లో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల వేదాశీర్వచనం తీసుకున్నారు. ఛైర్మన్​ సవాంగ్​కు ఏపీపీఎస్సీ సభ్యులు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

అనుహ్య బదిలీ… ఛైర్మన్​గా నియామకం…
డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌పై అనూహ్యంగా, ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో డీజీపీగా 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. వైసీపి ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్‌ 1న రాష్ట్ర డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఈనెల 15 వరకూ ఆ పోస్టులో కొనసాగారు. రెండేళ్ల 8 నెలల 15 రోజుల పాటు ఆయన డీజీపీ పదవి నిర్వహించారు. 2023 జులై నెలాఖరు వరకూ ఆయనకు సర్వీసు ఉంది. అలాంటిది ఉన్నపళంగా ఆయన్ను బదిలీ చేయటం ఏపీపీఎస్సీ ఛైర్మన్​గా నియమించటం చర్చనీయాంశమైంది.

Read Previous

గూడూరును “నెల్లూరు”లో కందుకూరును “ప్రకాశం”లోనే ఉంచండి : ఆదాల విజ్ఞాపన

Read Next

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం… ప్రస్తుతానికి భారతీయులు సురక్షితం

Leave a Reply

Your email address will not be published.