ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం… ప్రస్తుతానికి భారతీయులు సురక్షితం

Clock Of Nellore ( Buero Report ) – యుద్ధం మొదలైపోయింది. ఉక్రెయిన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లోని మెయిన్‌ సిటీస్‌ను టార్గెట్‌ చేసింది రష్యా. రాజధాని కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ను మూడు వైపులా నుంచి చుట్టుముట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టింది రష్యా సైనం. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని బాంబుల మోత మోగిస్తోంది. మిలటరీ ఆపరేషన్‌కు దిగిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్‌ కేపిటల్‌ కీవ్‌ను ఆక్రమించింది రష్యా. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను ముట్టడించింది రష్యా. బెలారస్, క్రీమియా, లుహాన్స్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు, ఒకేసారి మూకుమ్మడి దాడికి దిగాయి.

ఉక్రెయిన్‌సై సైనిక చర్యకు దిగిన పుతిన్, అమెరికా అండ్ నాటో దేశాలకు డైరెక్ట్ వార్నింగ్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించారు. ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం ప్రతీకారం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు పుతిన్. చరిత్రలో మీరు చూసిన పరిణామాలకు మిమ్మల్ని దారితీస్తుందని.. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించలేదని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌లో మా ప్రణాళికలు ప్రత్యేక సైనిక చర్యలో ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఉక్రెయిన్‌పై సైనిక చర్య అన్యాయమన్నారు అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్. రష్యా ఎటాక్‌కి ప్రతిదాడి తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో మరణాలకు ప్రపంచానికి రష్యా సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు బైడెన్‌. ఉక్రెయిన్‌పై రష్యా ఎటాక్‌పై అత్యవసరంగా సమావేశమైంది ఐరాస భద్రతా మండలి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఆపాలని కోరింది. అయితే, ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటున్నారు రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్.

ఇదిలావుంటే, రష్యా దాడులతో దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్‌. రష్యా ఎటాక్స్‌ నుంచి తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామంటామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అటు, ఉక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసేయడంతో విమానాల రాకపోకలకు బ్రేక్‌ పడింది. దాంతో, ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో భారతీయుల భద్రత ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు.

Read Previous

ఏపీపీఎస్సీ ఛైర్మన్​గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ…

Read Next

గూడూరును నెల్లూరులోనే ఉంచండి… పాశం సునీల్ ఆధ్వర్యంలో నిరసన

Leave a Reply

Your email address will not be published.