Clock Of Nellore ( Nellore ) – పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు వి ఆర్ సి మైదానంలో నిర్వహించే లక్ష దీపోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను వేమిరెడ్డి దంపతులు ఆవిష్కరించారు. వేలాదిగా భక్త జనులు పాల్గొనే లక్ష దీపోత్సవం నవంబర్ నెల 8 తేదీ మొదలై 10వ తేదీ ఆదివారం వరకు కొనసాగనుంది. నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్ నందు గల విపిఆర్ నివాసంలో నిర్వహించిన బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు కొనసాగే ఈ లక్ష దీపోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని శివ పార్వతుల ఆశీస్సులు అందుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్షదీపోత్సవ కమిటి కార్యవర్గ సభ్యులు కంజర్ల భాస్కర్ శర్మ, ఆమంచర్ల వెంకట ప్రభాకర్ రావు, గంధం సునీల్ కుమార్, ఆశం విజయసారధి తదితరులు పాల్గొన్నారు.
