అతి తక్కువ ఖర్చుతోనే మోకాలి మార్పిడి ఆపరేషన్లు : అపోలో హాస్పిటల్ ప్రకటన

  • మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో అపోలో హాస్పిటల్ నెంబర్ వన్
  • రోబోటిక్ సహాయంతో చేసే శస్త్ర చికిత్సలు 100 శాతం సురక్షితం
  • శస్త్ర చికిత్స చేయించుకునే వారికి పరీక్షలు ఉచితం
  • సద్వినియోగం చేసుకోవాలన్న నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు ( Nellore Apollo Hospital ). రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హాస్పిటల్ లో శుక్రవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, ఆర్ధోపెడిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానంద రెడ్డి , డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేయడంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ అగ్రగామిగా ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ నేపద్యంలోనే నెల్లూరు అపోలో హాస్పిటల్ లో రోబోటిక్ సాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ( Robotic knee replacement surgeries ). రోబోటిక్ సాయంతో చేసే శస్త్ర చికిత్సలు 100 శాతం ఖచ్చితత్వంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతే కాకుండా అతి తక్కువ రక్త స్రావంతో పాటూ శస్త్ర చికిత్సకు సంభందించిన మచ్చలు కూడా ఉండవన్నారు. శస్త్ర చికిత్స తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుందని, వేగంగా కోలుకోవచ్చునని చెప్పారు. శస్త్ర చికిత్స తర్వాత హాస్పిటల్ లో ఎక్కువ రోజులు కూడా ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స 100 శాతం సురక్షితమని, నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న ఈ శస్త్ర చికిత్సలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరాం సతీష్, డాక్టర్ వివేకానంద రెడ్డి , డాక్టర్ శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Read Previous

అపోలో హాస్పిటల్ లో తక్కువ ఫీజులతోనే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Read Next

మెడికవర్ లో వరల్డ్ స్ట్రోక్ డే : అవగాహన కల్పించిన డాక్టర్ దీక్షాంతి నారాయణ్

Leave a Reply

Your email address will not be published.