Clock Of Nellore ( Nellore ) – బ్రెయిన్ స్ట్రోక్ అనేది ముందుగా చెప్పి వచ్చే వ్యాధి కాదని అది తెలియకుండానే వచ్చి ఒక వ్యక్తిని కుంగదీసే ప్రమాదకరమైనదని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ దీక్షాంతి నారాయణ్ అన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దీక్షాంతి నారాయణ్ మాట్లాడుతూ ‘బ్రెయిన్ స్ట్రోక్’ అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా వికలాంగుడిగా మారుస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుందని చెబుతూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తరువాత రక్త నాళాలను తిరిగి తెరవడానికి రెండు చికిత్స విధానాలు అందుబాటు లో ఉన్నాయని చెప్పారు. ముందుగా, ‘థ్రోంబోలిసిస్ ఇంజెక్షన్’: ఇది పక్షవాతం ప్రారంభమైన 4-5 గంటల వరకు ఉపయోగపడుతుందన్నారు. ‘రెండవది థ్రోంబెక్టమీ’ –ఇది పక్షవాతం వచ్చిన 24 గంటల వరకు పని చేయగలిగేది, ఇది స్టెంట్ ద్వారా రక్తనాళంలో రక్త ప్రసరణకు అడ్డుగా ఉన్న దానిని తొలగించే పద్ధతి. పక్షవాతం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లగలిగితే యధావిధిగా జీవించగలుగుతారని డాక్టర్ దీక్షాంతి నారాయణ్ పేర్కొన్నారు. వైద్యరంగంలో అత్యుత్తమ వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం అందుబాటులో ఉందన్నారు.
పక్షవాతం వచ్చిన వ్యక్తులు వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత స్ట్రోక్ సెంటర్‌కు చేరుకోగానే, ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత త్వరగా మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుందనీ, స్ట్రోక్ వచ్చిన తరువాత ఆలస్యం చేస్తే రోగ నివారణ కష్ట సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఏ. వైష్ణవి మాట్లాడుతూ వరల్డ్ స్ట్రోక్ డే నీ ‘ BE FAST ‘అని పేర్కొంటామన్నారు. బి ఫాస్ట్ అనగా స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి మూర్చ పోవడం, తీవ్రమైన తలనొప్పి రావడం, మైగ్రేన్ నొప్పి, మతిమరుపు , వణుకు రావడం, తూగు రావడం, తిమ్మర్లు మంటలు, మెదడులో కనితులు కళ్ళు తిరగడం, పడకలో ఇబ్బంది, సయాటికా నొప్పులు, మెదడు ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటాయన్నారు. అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ముందుగా డాక్టర్లను సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకోవాలని ఆమె తెలిపారు. న్యూరో సర్జన్ డాక్టర్ దినేష్ గంగపట్నం మాట్లాడుతూ గతంలో వయసు పైబడిన వారికి వచ్చేటువంటి బ్రెయిన్ స్ట్రోక్ నేటి ఆహారపు అలవాట్ల వల్ల 30 సంవత్సరాలు పైబడిన యువకులలో అత్యధికంగా రావడాన్ని ఆందోళన కలిగిస్తుందన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల(గోల్డెన్ అవర్స్ )లో డాక్టర్లను సంప్రదించాలని చెప్పారు. మెదడులో రక్తం గడ్డ కట్టిన తర్వాత ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందన్నారు.
న్యూరో సర్జన్ డాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్లతో తోపాటు స్మోకింగ్ చేసే వారిలో కూడా చాలామంది స్ట్రోక్ కు గురవుతున్నారని అన్నారు. వ్యాధి లక్షణాలు కనుగొన్న వెంటనే న్యూరో ఫిజీషియన్ ను సంప్రదించి వైద్య సేవలు అందుకోవాలని అన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా నెల్లూరు మెడికవర్ ఆసుపత్రిలో ‘ స్ట్రోక్ క్లినిక్’ ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ కు సంబంధించి ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, మరియు డాక్టర్లు సూచించిన వైద్య పరీక్షలలో 50% రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజానీకం వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, మార్కెటింగ్ హెడ్ సతీష్ , పి ఆర్ ఓ చందు వర్మ, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
