అపోలో సేవలు అమోఘం : ప్రసంశించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్

  • అపోలో ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ గుండె దినోత్సవం
  • గుండె వ్యాధుల అవగాహన కోసం నగరంలో పెద్ద ఎత్తున వాక్ థాన్
  • వాక్ థాన్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్
  • పోలీసులకు అపోలో వైద్యుల ఉచిత గుండె వైద్య పరీక్షలు

Clock Of Nellore ( Nellore ) – సమాజ శ్రేయస్సు కోసం 24 గంటలూ విధులు నిర్వహించే పోలీసులకు వైద్య సేవల పరంగా అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భరోసాగా నిలవడం హర్షించదగ్గ విషయమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆదివారం నెల్లూరు కేవిఆర్ సర్కిల్ నుండి పోలీసు కవాతు మైదానం వరకూ అపోలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పెద్ద ఎత్తున నిర్వహించిన వాక్ థాన్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి, CTVS సర్జన్ డాక్టర్ విజ్ఞ చరణ్, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం, ఇతర వైద్య సిబ్బంది గుండె వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాక్ థాన్ ను నిర్వహించారు. కేవిఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, అదనపు ఎస్పీ సౌజన్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎస్పీ కృష్ణకాంత్ జెండా ఊపి వాక్ థాన్ ను ప్రారంభించారు. పోలీసు కవాతు మైదానం వరకూ వాక్ థాన్ సాగింది. ఈ వాక్ థాన్ లో ఎస్పీ, ఇతర పోలీసు సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పోలీసు కవాతు మైదానంలో ఎస్పీ కృష్ణకాంత్ కలిసి అపోలో వైద్యులు వెయ్యి హీలియం బెలూన్లు గాల్లోకి వదిలారు.

అనంతరం ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ 24 గంటలూ విధుల్లో ఉండే పోలీసులు వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. ప్రధానంగా పోలీసులు పని ఒత్తిడిని ఎదుర్కొంటుంటారని, ఒత్తిడి వల్ల గుండె సంభందిత రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పోలీసులందరూ ఏడాది ఒక సారి ఫుల్ బాడీ చెక్ అప్ చేయించుకోవాలని, ఆ విషయంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. వైద్య సేవల పరంగా అపోలో హాస్పిటల్ పోలీసులకు భరోసాగా నిలవడం సంతోషించదగ్గ విషయమని సంతోషం వ్యక్తం చేశారు. అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ పోలీసులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ నిత్యం తేలికపాటి వ్యాయామాలు చేస్తే గుండె సంభంద సమస్యలకు దూరంగా ఉండవచ్చునని సూచించారు. మానవ దేహంలో గుండె ఎంతో ముఖ్యమైందని, అటువంటి గుండెను ఎల్లవేళలా సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పోలీసులకు ఉచితంగా గుండె సంభంద సమస్యలకు ఉచితంగా పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొని అపోలో అందించిన ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

 

Read Previous

మెడికవర్ లో ప్రపంచ గుండె దినోత్సవం : ఆసనాలతో గుండె పదిలం అంటున్న వైద్యులు

Read Next

అక్టోబర్ 3 నుండి ఇరుకళల పరమేశ్వరి ఉత్సవాలు : పోస్టర్ ఆవిష్కరించిన కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.