నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అధునాతన గుండె శస్త్ర చికిత్స విజయవంతం

  • నెల్లూరు అపోలో హాస్పటల్లో అధునాతన శస్త్ర చికిత్స…
  • ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి గుండె ఆపరేషన్ (కాలు ద్వారా కావాటం అమరిక ) విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ కార్దియాలాజిస్ట్ చిర్రా భక్తవత్సల రెడ్డి బృందం…
  • మామూలు స్థితికి చేరుకున్న పేషంట్…
  • వైద్యులకు ప్రశంసల జల్లు…

Clock Of Nellore ( Nellore ) – క్లిష్టతరమైన ఆపరేషన్లకు నెల్లూరు అపోలో హాస్పిటల్ కేరాఫ్ గా నిలుస్తోంది. ఇతర దేశాలకు సైతం ధీటుగా అధునాతన సేవలందించడంలో అపోలో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ సందర్బంగా అపోలో ఆసుపత్రి లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశం లో ఆసుపత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ప్రముఖ కార్దియాలాజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ కు చెందిన నాగేశ్వరరావు(70) అనే వ్యక్తి గత కొంత కాలంగా ఆయాసం, దగ్గు, చాతి నొప్పితో బాధపడుతున్నాడు. అతను వివిధ ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్న ఫలితం లేదు. ఈ క్రమంలో ఆ పేషంట్ నెల్లూరు అపోలోకు రావడం జరిగింది. అతనికి పరీక్షలు చేయగా ఆక్సిజన్ పల్స్ శాతం 80, హార్ట్ రేట్ 130, కిడ్నీ ఫంక్షన్ 2.3 గా గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉండే ( కవాటము) మూసుకొని ఉంది. అయితే ఐదు సెంటీమీటర్లు ఉండాల్సి ఉండగా కేవలం 7 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. దీనివల్ల గుండె బాగా బలహీన పడింది. దీంతో ఆ పేషెంట్ ను వారం రోజులు పాటు ఐసీయూ లో ఉంచడం జరిగింది. అనంతరం ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం. కానీ అతనికి ఆపరేషన్ 30% రిస్క్ తో కూడిన విషయం. ప్రాణాపాయంతో కూడిన ఆపరేషన్ కావడంతో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాము.

కాలు ద్వారా అమర్చుట…
పేషంట్ నాగేశ్వరరావుకు సరికొత్త విధానం ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది. కాలు ద్వారా వాలు అమర్చి ఆపరేషన్ చేయడం జరిగింది. దీని ఖరీదు సుమారు 20 లక్షలు అవుతుంది. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కుట్లు ఉండవు, రక్తం పల్స్ బలహీనపడే మాత్రలు చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో వెళ్ళిపోవచ్చు.

ఆపరేషన్ విధానం…
పేషంట్ గుండెను పేస్ మేకర్ ద్వారా నాలుగు సెకండ్లు ఆపి కాలు నుంచి వాలును పొజిషన్ లోకి తీసుకొని నాలుగు సెకండ్లలో అమర్చవచ్చు. గత 15 సంవత్సరాలుగా యూఎస్, యూరప్ దేశాలలో వివిధ పద్ధతుల ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే గత పది ఏళ్ల నుంచి ఇండియాలో కేవలం మహానగరాలలో మాత్రమే ఈ ఆపరేషన్లు జరుగుచున్నవి. ముఖ్యంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఇది రెండవది. కావలికి చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ల క్రితం మొదటి ఆపరేషన్ చేయడం జరిగింది. రెండవది నాగేశ్వరావుకు చేయడం జరిగింది. విజయవంతంగా ఈ ఆపరేషన్లో పూర్తిచేయడం సంతోషంగా ఉంది. ఖర్చు తో కూడిన పని అయినప్పటికీ,, దీనిపట్ల ప్రజలకు అవగాహన అవసరం.ఈ పత్రికా విలేఖరుల సమావేశంలో ఆసుపత్రి ఎమర్జెన్సీ మరియు ఐసీయూ హెడ్ డాక్టర్ శ్రీనివాస్, కార్దియో తోరాసిక్ సర్జన్లు డాక్టర్ విజ్ఞ చరణ్, డాక్టర్ మధు, కార్దియాలాజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం, యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో నెల్లూరుజిల్లా ఎమ్మెల్యేలు

Read Next

ఏపిలో కొలువైన కొత్త ప్రభుత్వం : ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం

Leave a Reply

Your email address will not be published.