Clock Of Nellore ( Amaravathi ) – విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో మంగళవారం ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ సమావేశంలో, ఎమ్మెల్యేలంతా ఏపి నూతన సిఎంగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. వారందర్నీ సమావేశంలో నారా లోకేష్ పేరు పేరున పలకరించారు. నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకార్ల సురేష్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. వారందర్నీ లోకేష్ పేరు పేరునా పలకరించారు. సమావేశానికి ముందు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఆయన కుమార్తె చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలిసి సత్కరించారు.