పోస్ట్ లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ కవర్లు : సీలు వేసి స్ట్రాంగ్ రూములో ఉంచిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోస్ట్ లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం నెల్లూరు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఉంచి సీలు వేశారు. పోస్ట్ లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ కవర్లను పోస్టల్ సిబ్బంది కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ కు అందజేశారు. ఈ పోస్టల్ బ్యాలెట్ లను ట్రంక్ పెట్టెలో భద్రపరిచి సీలు వేశారు. అనంతరం స్ట్రాంగ్ రూములో బాక్సులను ఉంచి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కు తాళాలు వేసి సీలు వేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ బాపిరెడ్డి, వైఎస్ఆర్సిపి ప్రతినిధి సుబ్బారాయుడు, టిడిపి ప్రతినిధి కృష్ణ చైతన్య పాల్గొన్నారు. 

Read Previous

ఈనెల 22న నెల్లూరుకు గవర్నర్ అబ్ధుల్ నజీర్ రాక : VSU స్నాతకోత్సవానికి హాజరు

Read Next

నెల్లూరులో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ : బాధితురాలికి పరామర్శ

Leave a Reply

Your email address will not be published.