Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటి నియోజకవర్గం 8, 9, 51,52 డివిజన్ లలో టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రామమూర్తి నగర్ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి, పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, వైసీపి జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 51 డివిజన్ నుండి ఫిలిక్స్ శ్యామ్ కుమార్ అధ్వర్యంలో 150 మంది అతని అనుచరులు పార్టీలో చేరారు. 8, 9 డివిజన్లు నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే 52 వ డివిజన్ నుండి స్వచ్చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్ధులను గెలిపించేందకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. టిడిపి ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగిస్తున్న మా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి ఆ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. పార్టీలో చేరిన వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
