జగన్ ఉంటే ఎవరికీ ఉద్యోగాలు రావు : ప్రచారంలో నాారయణ మండిపాటు

Clock Of Nellore ( Nellore ) – జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌న‌లో రాష్ట్రంలోని ఏ ఒక్క‌రికి ఉద్యోగాలు రావ‌ని, ఒక్క నారా చంద్ర‌బాబు నాయుడుతోనే యువ‌త భ‌విష్య‌త్ గ్యారెంటీ అని…మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ పేర్కొన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా… ఆయ‌న‌ నెల్లూరు న‌గ‌రం 9వ డివిజ‌న్ లో ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు. ముందుగా నారాయ‌ణ‌కి అడుగ‌డుగునా పూల వ‌ర్షం కురిపిస్తూ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. డివిజ‌న్‌లోని ఇంటింటికెళ్లి…2014 నుంచి 2019 వ‌ర‌కు టీడీపీ ప్ర‌భుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేశారు. చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన టీడీపీ మేనిఫెస్టో సూప‌ర్ సిక్స్ సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు.

అనంత‌రం డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ప‌ర్య‌ట‌న‌లో జాఫ‌ర్ సాహెబ్ కెనాల్ ప‌క్క‌న ఉన్న ఇళ్ల‌ను విజిట్ చేయ‌డం జ‌రిగిందన్నారు. ఈ డివిజ‌న్ చాలా వ‌ర‌కు చిన్న చిన్న ప‌నులు చేసుకుంటున్నార‌ని, మ‌రి కొంద‌రు యువ‌కులు బీటెక్‌, ఎంబీఏలు చేసి ఉన్నార‌ని..వారంద‌రూ కూడా ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నార‌న్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న జ‌రిగితే…రాష్ట్రంలో ఒక్క‌రికి కూడా ఉద్యోగాలు రావ‌ని వైసీపీ ప్ర‌భుత్వంపై సెటైర్లు వేశారు. ప్ర‌ధానంగా ఉద్యోగాలు రావాలంటే…అన్నీ రంగాలు డెవ‌ల‌ప్ కావాల‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ బాగా జ‌ర‌గాల‌ని, అదే విధంగా వ్యాపారస్తులు త‌మ వ్యాపారాన్ని బాగా చేయాల‌ని…అదే విధంగా అధికంగా రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు రావాల‌ని వ‌స్తేనే…ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. ఏ డివిజ‌న్ కెళ్లినా… మాకు డ్రైన్లు వ‌ద్దు…రోడ్లు వ‌ద్దు…ఇంకే వ‌ద్దు…మా పిల్ల‌ల‌కి ఉద్యోగాలు లేవ‌ని…మీరైనా వ‌చ్చి మా వాళ్ల‌కి ఉద్యోగాలు ఇప్పించాల‌ని అడుగుతున్నార‌న్నారు. ఏ త‌ల్లిదండ్రులైనా త‌మ పిల్ల‌లకు ఉద్యోగాలు వ‌చ్చి మంచి పొజిష‌న్‌లో ఉండాల‌ని కోరుకుంటార‌న్నారు. ఇవ‌న్నీ కావాలంటే…రాష్ట్రంలో డెవ‌ల‌ప్‌మెంట్ ఉండాల‌న్నారు. దేశం కానీ…రాష్ట్రం కానీ బాగుప‌డాలంటే…వ్యాపారస్తులంద‌రూ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో వ్యాపారాలు చేసుకొని లాభాలు బాగా ఆర్జించాల‌న్న‌దే మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని తెలిపారు. అప్పుడు ఆటోమెటిక్ గా రాష్ట్ర ఖ‌జానానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం వ‌స్తుంద‌న్నారు. అలా వ‌చ్చిన ఆదాయంతోనే డెవ‌ల‌ప్ మెంట్‌, సంక్షేమం చేయ‌గలుగుతామ‌ని చెప్పారు. అందు కోస‌మే…చంద్ర‌బాబు ఇత‌ర దేశాల‌కు వెళ్లి…పెద్ద పెద్ద కంపెనీల సీఈవోల‌తో ఒప్పందాలు కుదుర్చుకొని…ఆ కంపెనీల‌ను మ‌న రాష్ట్రానికి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించార‌ని గుర్తు చేశారు. ఉదాహార‌ణ‌కి అనంత‌పురంలోని కియా కంపెనీయేన‌న్నారు. ఈ రోజు…ఆ ప‌రిశ్ర‌మ వ‌ల్ల‌…సుమారు 10వేల మంది బాగుప‌డ్డార‌న్నారు. ఇలా…రాష్ట్రాభివృద్ధి, ప్ర‌జా సంక్షేమం చేయాల‌న్న ఆలోచ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అస‌లు లేద‌ని ఎద్దేవా చేశారు. మ‌ళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టే స‌త్తా ఒక్క చంద్ర‌బాబు నాయుడుకే ఉంద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు పోటీ చేస్తున్నామ‌ని… ప్ర‌జ‌లంద‌రూ మే 13న జ‌రిగే ఎన్నిక‌ల్లో సైకిల్ కి గుర్తుకి ఓటేసి…గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. కేంద్రం నుంచి వేమిరెడ్డి, రాష్ట్రం నుంచి నేను పెద్ద ఎత్తున నిధులు తీసుకువ‌చ్చి…భార‌త‌దేశంలోనే నెల్లూరు న‌గ‌రాన్ని నెం. 1 మోడ‌ల్ సిటీగా చేసి చూపిస్తామ‌ని నారాయ‌ణ ప్ర‌జ‌ల‌కి హామీ ఇచ్చారు.

Read Previous

మార్కెట్ లో కూరగాయలు అమ్మిన విజయసాయిరెడ్డి : కొనుగోలు చేసిన ఆదాల, ఖలీల్

Read Next

నిరుద్యోగ రహిత నెల్లూరే తన లక్ష్యం : యువతతో విజయసాయిరెడ్డి ముఖాముఖి

Leave a Reply

Your email address will not be published.