Clock Of Nellore ( Nellore ) – నిరుద్యోగం లేని నెల్లూరే తన లక్ష్యమని, నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో ప్రతి 6 నెలలకోసారి దేశంలోని వివిధ ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయి రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలియజేశారు. మంగళవారం నెల్లూరు రామ్మూర్తి నగర్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారంలో ఒకసారి ప్రజాదర్బాన్ నిర్వహిస్తామని అన్నారు. పార్లమెంట్ పరిధిలో ఏ ప్రాంతంలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రజాదర్బార్ కు వచ్చి వినుతులు ఇవ్వవచ్చని అన్నారు. ముఖాముఖిలో యువత ప్రశ్నలకు జవాబిస్తూ నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించామని, మేనిఫెస్టోలోని ప్రతి హామీని 100శాతం నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరులో ఐటీ సెజ్, ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి తన స్వాగ్రామమని, ఇక్కడే పుట్టి పెరిగి విద్యాబ్యాసం చేశానని అన్నారు. నెల్లూరుకు ఎంపీ అభ్యర్దిగా నన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేసుకునే అవకాశం కల్గుతుందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో 50 శాతం 25 సంవత్సరాలలోపు యువత ఉందని, 35 సంవత్సరాలలోపు ఉన్న వారు 65 శాతం ఉన్నారని అన్నారు. దేశ ఉత్పాదకత పెంచే బాధ్యత యువతపై ఉందని అన్నారు. దేశాభివృద్ధికి, అవినీతి రహిత దేశాన్ని తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలని యువతను విజయసాయి రెడ్డి కోరారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో కేవలం 34108 ఉద్యోగాలు మాత్రమే కల్పించాడని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిాకారంలోకి వచ్చాక 222000 శాశ్వత ఉద్యోగాలు ఇప్పించారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది తిప్పికొట్టాలని కోరారు. ఎపీ క్రికెట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాధ్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో విశాఖపట్నంలో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేరని అన్నారు. 30వేల మందికి నిత్యవసర వస్తువులు అందించారని అన్నారు. అలాగే 300 బెడ్స్ తో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు. హనీ గ్రూప్ అధినేత ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకు ఎంపీ అభ్యర్దిగా విజయసాయి రెడ్డి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. యువత విశేషంగా కృషి చేసి రానున్ను ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. ఆయన చెప్తే తప్పక చేస్తారని అన్నారు. కార్యక్రమంలో ప్రసాద్, యువత ప్రతినిధులు పాల్గొన్నారు.
