Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డిని హోటల్స్ అసోసియేషన్ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, 25 కళా సంఘాల ప్రతినిధులు అమీర్ జాన్, హరినాథ్ రెడ్డి తదితరులు ఆయన్ను వారి నివాసంలో కలిసి పూలమాలతో సత్కరించారు. విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డిని కూడా కలిసి సత్కరించారు. ఈ సందర్బంగా హోటల్స్ సమస్యలపై, కళాకారుల సమస్యలపై చర్చించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అండగా ఉంటామని ఆదాల ప్రభాకర్ రెడ్డికి హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే హోటల్స్ సమస్యలపై దృష్ఠి సారిస్తానని, కళాకారులకు అండగా ఉంటానని ఆదాల వారికి హామీ ఇచ్చారు.

Tags: 2024 AP Assembly Elections Nellore Rural Constituency News Nellore Rural YCP Mla Candidate Adala Prabhakar Reddy