Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్ధి పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారాన్ని విస్త్రృతంగా నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటూ సతీమణి పొంగూరు రమాదేవి, కుమార్తెలు సింధూర, శరణి కూడా నియోజకవర్గంలో ప్రతీ రోజూ ప్రచారం నిర్వహిస్తూ త్వరలో జరిగే ఎన్నికల్లో నారాయణను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణ ద్వారానే నెల్లూరు అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. తాజాగా మంగళవారం నాడు అభ్యర్ధి పొంగూరు నారాయణ 43వ డివిజన్ లోని జెండా వీధిలో పర్యటించారు. స్థానికులతో కలిసి ఇంటింటికి వెళ్లారు. స్థానికులు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ మీకే మా ఓటు అంటూ హామీ ఇచ్చారు. గడప గడపకు వెళ్లిన నారాయణ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటూ వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో వైసీపి ప్రభుత్వం సమస్యలను గాలికొదిలేసిందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్నీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం నాారాయణ మీడియాతో మాట్లాడుతూ జెండావీధిలో ఉన్న రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నాయని, వాటిని వెడల్పు చేయాల్సి ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మన్సూర్ నగర్ ను ఎంతో అభివృద్ధి చేశానని, జెండావీధిని కూడా అలాగే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేస్తే దోమల సమస్యే ఉండదని పేర్కొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేని కాకపోయినా నెల్లూరును ఎంతో అభివృద్ది చేశానని, ఈ సారి ఎన్నికల్లో గెలిపిస్తే అధికారంలోకి రాగానే అన్నీ పెండింగ్ పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
మరో వైపు నాారాయణ కుమార్తె పొంగూరు శరణి కూడా మంగళవారం 8వ డివిజన్ లోని రేబాలవారివీధిలో పర్యటించారు. అక్కడకు చేరుకున్న ఆమెకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె గడప గడపకూ తిరుగుతూ ఓటర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి తన తండ్రి నారాయణను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. 2014 నుండి 2019 వరకూ ఉన్న టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసీపి ప్రభుత్వం మధ్య ఉన్న తేడాను గమనించాలని ప్రజలను కోరారు. నేటి వైసీపి ప్రభుత్వంలో అభివృద్ధి అనేదే లేదని, ఉన్నదంతా దోపిడీలు, దౌర్జన్యాలేనని విమర్శించారు. సుపరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. నారాయణను గెలిపిస్తే నెల్లూరును మెట్రో పాలిటిన్ సిటీ తరహాలో తీర్చిదిద్దుతారని శరణి హామీ ఇచ్చారు.
