Clock Of Nellore ( Nellore ) – సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపద్యంలో నెల్లూరుజిల్లాలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అధికారులు కూడా ఎన్నికలకు సిద్దమవుతూనే ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపద్యంలో కేంద్ర బలగాలు నెల్లూరు నగరానికి చేరుకున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( BSF ) జిల్లాకు చేరుకుంది. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంభందించి120 మంది, కావలి నియోజకవర్గానికి 80 మందిని కేటాయించారు. వీరంతా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలకు కేటాయించిన BSF జవాన్లకు వెంకటేశ్వర పురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనంలో వసతి కల్పించారు. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో కవాతు నిర్వహించి ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకొనేలే దోహదపడనున్నారు. సోమవారం మరి కొంతమంది BSF జవాన్లు కూడా నెల్లూరుకు చేరుకోనున్నారు. వారిని మిగిలిన నియోజకవర్గాలకు కేటాయించనున్నారు.
