Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పి.టి. రంగరాజన్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ పక్కన 40 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రాహ్మణ కర్మక్రతువుల భవనాన్ని శనివారం నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఆ భవనంలో అవసరమైన ఫ్రీజర్స్, ఇతర వస్తువులను తన సొంత నగదుతో త్వరలోనే సమకూరుస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ బాలాజీ నగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల మంది పేద, మధ్య తరగతి బ్రాహ్మణులు అద్దె నివాసాల్లో ఉంటున్నారని, ఆయా కుటుంబాల్లో ఎవరైనా కాలం చేస్తే పార్ధివ దేహాం పెట్టుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయం తన దృష్ఠికి రాగానే 8 నెలల క్రితం కర్మక్రతువుల భవనానికి శంఖుస్థాపన చేశానని, నేడు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ భవనంలో అవసరమైన అన్నీ వస్తువుల తానే సొంత నగదుతో సమకూరుస్తానని అనీల్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, నేతాజీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
