ప్రతీ రోజూ… ప్రతీ గడపా… ప్రచారంలో బిజీబిజీగా కోటంరెడ్డి కుటుంబం

Clock Of Nellore ( Nellore ) – వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ వారి కుటుంబసభ్యులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్క రోజు కూడా విరామం లేకుండా ప్రతీ రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక చోట గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజిత, కుమార్తెలు హైందవి, వైష్ఠవిలు ఇంటింటికి వెళ్లి కోటంరెడ్డిని గెలిపించాలని అభ్యర్ధిస్తున్నారు. తాజాగా సోమవారం వారు 18వ డివిజన్ పరిధిలోని హరనాథపురం, నాగసాయి మందిరం ప్రాంతంలో పర్యటించారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ప్రతీ ఇంటికి వెళ్లారు. ఓటర్లను కలుస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరో సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read Previous

వచ్చేది టిడిపి ప్రభుత్వమే : తెలుగుదేశంలో చేరిన నాగిశెట్టి బాబురావు

Read Next

ప్రజలే వైసీపి స్టార్ క్యాంపైనర్లు : వాలంటీర్ల సభలో ఎంపి ఆదాల వెల్లడి

Leave a Reply

Your email address will not be published.