Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో ఇటీవల నేరాల సంఖ్య పెరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా హత్యా ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ప్రసాద్ అనే వ్యక్తిని దుండగులు భార్య కళ్లెదుటే అతి కిరాతకంగా హత్య చేశారు. నెల్లూరు రామచంద్రాపురంలో నివాసం ఉండే ప్రసాద్ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా కొందరు దుండగులు వారి ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి చొరబడి భార్య నోట్లో గుడ్డలు కుక్కి కదిలిదే చంపేస్తామంటూ బెదిరించారు. భార్య కళ్లముందే ప్రసాద్ ను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. శరీరంపై 25 చోట్ల కత్తులతో నరికారు. కాళ్లు, చేతులు, మెడ, చాతి తదితర ప్రాంతాల్లో పాశవికంగా నరికి చంపి అక్కడి నుండి పరారయ్యారు. నిందితుల పరారీ అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల గుర్తింపు కోసం డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. క్లూస్ టీం సిబ్బంది కూడా ఆధారాల కోసం అన్వేషించారు. పాత కక్షల నేపద్యంలో హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే వివాహేతర సంభందాల అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
