Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం నియోజకవర్గంలో విస్త్రృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సతీమణి సుజిత, కుమార్తెలు హైందవి, వైష్ణవిలు నియోజకవర్గంలోని ప్రతీ గడపకూ వెళ్లి త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గడప గడపకు వెళ్తున్న కోటంరెడ్డి కుటుంబాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. తాజాగా శనివారం వారు నెల్లూరు 18వ డివిజన్ పరిధిలోని హరనాథపురంలో పర్యటించారు. ఆ ప్రాంతానికి వెళ్లిన కోటంరెడ్డి కుటుంబసభ్యులకు స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆ ప్రాంతంలోనే నివాసం ఉండే టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ను కలిసి కరపత్రాన్ని అందజేశారు. తర్వాత హరనాథపురంలోని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్ధించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్ధించారు. మరో వైపు వైసీపిలో కొనసాగుతున్న మాలమహానాడు నేత కమతం అశోక్ తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో అశోక్ టిడిపిలో చేరారు. అలాగే సౌత్ మోపూరు గ్రామానికి చెందిన రాపూరు అంకయ్య కూడా తన మిత్ర బృందంతో కలిసి కోటంరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


