ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన అపోలో వైద్యులు డాక్టర్ వేదమూర్తి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి. వేదమూర్తి రెడ్డి ప్రతిష్ఠాత్మక రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం పొందారు. 2021వ సంవత్సరంలో 46 ఏళ్ల రోగి శరీరంలోని అడ్రినల్ మైలోలిపోమాకు సంభందించిన స్థానంలో క్యాన్సర్ కారక 13 సెంటీమీటర్ల పెద్ద కణతిని ఎలాంటి కోత లేకుండా లాపరోస్కోపీ ద్వారా విజయవంతంగా డాక్టర్ వేదమూర్తి రెడ్డి తొలగించారు. 13 సెంటీమీటర్ల కణతిని ఆసియా దేశాల్లో ఇప్పటి వరకూ లాపరోస్కోపీ ద్వారా ఎవరూ తొలగించలేదు. ఈ విషయాన్ని డాక్టర్ వేదమూర్తి రెడ్డి ఆసియా బుక్ రికార్డ్స్ వారి తెలియజేయగా వారు ఆసియా దేశాల్లో పరిశీలించి ఈ విషయాన్ని ఈ ఏడాది ఆగస్టు 24న నిర్ధారణ చేశారు. ఇవాళ డాక్టర్ వేదమూర్తి రెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ధృవపత్రంతో పాటూ అవార్డును అందజేశారు. ఇదే సర్జరీ విషయంలో ఇండియా బుక్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ధృవపత్రం అందజేసి, అవార్డును అందజేశారు. దీనిపై డాక్టర్ వేదమూర్తి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాం సతీష్, ఇతర వైద్యులు, సిబ్బంది వేదమూర్తి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Previous

చంద్రబాబుతోనే మహిళా సంక్షేమం : ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడి

Read Next

మెడికవర్ లో ప్రపంచ ట్రామా డే : ఎంతో మంది ప్రాణాలు రక్షించామన్న వైద్యులు

Leave a Reply

Your email address will not be published.