Clock Of Nellore ( Nellore ) – ప్రతి సంవత్సరం అక్టోబరు 17వ తేదీని వరల్డ్ ట్రామా డేగా పాటిస్తారు. ఈ సంవత్సరం థీమ్ Empowering Voices, Healing Wounds Together !. సాధారణంగా, గాయం అనేది కాలిన గాయాలు, పడిపోవడం, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వివిధ మూలాల ద్వారా శరీరానికి కలిగే శారీరక గాయం మొదలైనవి. ప్రపంచవ్యాప్తంగా గాయానికి ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలు. ప్రపంచ ట్రామా డే సందర్భంగా మంగళవారం నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు ట్రాఫిక్ డిఎస్పీ అబ్ధుల్ సుభహాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యి మాట్లాడారు. ప్రపంచ ట్రామా డే ను ఈ రోజున పాటించడం యొక్క ప్రధాన లక్ష్యం ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలనే దానిపై అవగాహన కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం అని అన్నారు. భారత దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మితిమీరిన వేగం, హెల్మెట్ లేకపోవడం.. వంటి పలు కారణాలతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. దేశంలో సగటున ప్రతిరోజూ 1000 కి పైగా రోడ్డు ప్రమాదాలు, 400 కి పైగా మరణాలు నమోవుతున్నాయన్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం, ప్రతి సంవత్సరం 50 లక్షల మందికి పైగా గాయాల కారణంగా మరణిస్తున్నారు. ఇది ప్రతి ఆరు సెకన్లకు ఒక మరణం మరియు ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలలో 9 శాతానికి సమానం. ఏటా భారతదేశంలో 10 లక్షల మంది గాయాల కారణంగా చనిపోతున్నారని, మరో 2 కోట్ల మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారని అంచనా అని పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సూచనలు, జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందుకు కారణాలు మితిమీరిన వేగం, మద్యం త్రాగి వాహనాలు నడపడం, ముందు వాహనాన్ని అధిగమించేందుకు వేగంగా వెళ్లడం , నిద్ర వస్తున్నా వాహనాలను నడపడం , పాదచారులు చూసుకొని నడవకపోవడం మరియు సిగ్నల్స్ పాటించకపోవడం వల్ల ముఖ్యంగా రోడ్ ప్రమాదాలు జరుగుతున్నారని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నెల్లూరులో మెడికవర్ హాస్పిటల్ నేషనల్ హైవే పక్కనే ఉండటం వల్ల తమ ఆసుపత్రి ప్రమాదానికి గురైన ఎంతోమంది ప్రాణాలను రక్షించగలిగిందన్నారు. ఎమర్జెన్సీ విభాగం డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంట లోపల ( గోల్డెన్ హవర్ ) బాధితుడిని ఆసుపత్రిలో చేర్చ గలిగితే అతనికి తక్షణ వైద్యం అంది అతను రక్షింప బడే అవకాశం వుంటుందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో స్పందించడం మరియు వారిని ఎంత త్వరగా హాస్పిటల్స్ కి చేర్చగలిగితే మనం అంతగా ప్రాణ నష్టం మరియు ఇతర పరిస్థితుల నుంచి కాపాడినవాళ్ళం అవుతామని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ సదస్సులో ఆర్థోపెడిక్ డాక్టర్ కుమార్ బాబు, న్యూరో సర్జన్ డాక్టర్ దినేష్ గంగపట్నం, న్యూరో సర్జన్ ధీరజ్,ఆర్థోపెడిక్ డాక్టర్ భాను ప్రకాష్, మెడి కవర్ హాస్పిటల్స్ నెల్లూరు సెంటర్ హెడ్ ధీరజ్ రెడ్డి, మెడి కవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ బిందు రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
