పురంధేశ్వరికి క్షమాపణలు చెప్పండి : సజ్జలను డిమాండ్ చేసిన భాను ప్రకాష్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – ఓటమి భయంతో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై కూడా అనుచితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే పురంధేశ్వరికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నెల్లూరుకు విచ్చేసిన భాను ప్రకాష్ రెడ్డి బిజేపి జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయిందని అంటూ పురంధేశ్వరిపై మాట్లాడే అర్హత మీకు ఉందా అని ప్రశ్నించారు. గాల్లో లేదంటే పరదాల మాటున తిరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రంలో వైసీపి సెక్షన్లను అమలు చేస్తూ విధ్వంసం సృష్ఠిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా సాగుతుందని, దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేస్తే అంత ఉలుకెందుకని సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. నిజంగా మీరు నిజాయితీ పరులైతే సిబిఐ విచారణకు సిద్దపడాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇంటికి వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని వైసీపికి భాను ప్రకాష్ రెడ్డి సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బిజేపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, నేతలు సురేంద్రరెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, కందికట్ల రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

సర్వేపల్లిలో జగనన్న కాలనీ : ప్రారంభించిన మంత్రి కాకాణి

Read Next

చంద్రబాబుతోనే మహిళా సంక్షేమం : ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.