పెద్ద సౌండ్ తో ఫోన్ కు ఎమర్జెన్సీ అలెర్ట్స్ : ఉలిక్కి పడ్డ జనం

Clock Of Nellore ( Delhi ) – మీ మొబైల్‌కి ఇవాళ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చిందా..? అయితే కంగారు పడొద్దు. దేశ వ్యాప్తంగా మొబైల్ స్క్రీన్‌లపై ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. దీంతో చాలా మంది ఉలిక్కిపడి.. ఏమైందోనని భయాందోళనలకు గురయ్యారు. టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లేపై ప్రత్యక్షమైంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుబంధంతో ఈ టెస్టింగ్ జరిగింది. భవిష్యత్‌లో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను అలర్ట్ చేయడానికి ట్రయల్ టెస్ట్ నిర్వహించారు.

ఆ మెసేజ్‌లో ఏముందంటే.. “ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. మీ నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది” అని అందులో ఉంది. మొదట ఇంగ్లిష్ భాషలో అలర్ట్ రాగా.. తరువాత తెలుగు, హిందీ భాషల్లో కూడా ఎమర్జెన్సీ అలర్ట్ సందేశం వచ్చింది.

అత్యవసర పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకేసారి అలర్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరినీ అలర్ట్ చేస్తూ.. టెస్టింగ్ మెసేజ్ పంపించింది. మొబైల్ ఆపరేటర్లు, సెల్ బ్రాడ్ కాస్టింగ్ వ్యవస్థలకు సంబంధించిన ఎమర్జెన్సీ అలర్ట్ సామర్థ్యాన్ని, ఎఫెక్ట్‌ను అంచనా వేస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాంటి అలర్ట్ మెసేజ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర టెలి కమ్యూ నికేషన్ విభాగం తెలిపింది. వరదలు వచ్చినప్పుడు.. భూకంపాలు సంభవించినప్పుడు.. సునామీ సహా పలు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసి.. కాపాడేందుకు కేంద్రం ఇలాంటి హెచ్చరికలు పంపించనుంంది. ఇప్పటికే జూలై 20, ఆగస్టు 17న కూడా కేంద్రం ఎమర్జెన్సీ మెసేజ్‌లు పంపించింది. తాజాగా నేడు మరోసారి టెస్ట్ చేసింది.

Read Previous

సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు

Read Next

విక్రమ సింహపురి యూనివర్శిటీ గ్రీన్ పార్టనర్ గా SEIL

Leave a Reply

Your email address will not be published.