చంద్రబాబు విడుదల కోసం పూజలు : హాజరైన మాజీ మంత్రి నారాయణ

Clock Of Nellore ( Nellore ) – వినాయక చవితి పండుగ వేడుకలను నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వినాయకునికి పూజలు నిర్వహించారు. చంద్రబాబు విడుదల కావాలని కాంక్షించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు కేసులో రేపటి కోర్టు ఉత్తర్వులు అనుకూలంగా వస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటూ పనబాక భూలక్ష్మి, రేవతి, శ్రీదేవి, పొత్తూరి శైలజ, ప్రమీల, నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో చవితి వేడుకలు : హాజరైన మేయర్ స్రవంతి

Read Next

విజయోస్తూ JAGAN : ఆకట్టుకున్న సిఎం సైకత శిల్పం

Leave a Reply

Your email address will not be published.