అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్ఠం : మాజీ మంత్రి అనీల్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్ఠంగా భావిస్తున్నానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు 13వ డివిజన్ పరిధిలోని ఎలమవారిదిన్నెలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎలమవారిదిన్నె వాసులు తనకు ఎప్పుడూ ఆండగా ఉంటూ వస్తున్నారని, అలాంటి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్ఠంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం అదే ప్రాంతంలో 30 లక్షలతో నూతనంగా చేపడుతున్న రోడ్లు నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, వైసీపి నేతలు ఊటుకూరు చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Read Previous

వైసీపిలో చేరిన మేయర్ స్రవంతి దంపతులు : ఆహ్వానించిన ఎంపిలు ఆదాల, వేమిరెడ్డి

Read Next

రెండు రోజుల్లో గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు పూర్తి : ఎంపి ఆదాల వెల్లడి

Leave a Reply

Your email address will not be published.