Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. నెల్లూరులోని 24, 25 డివిజన్లలో ఆయన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలను మంగళవారం నిర్వహించారు. 24వ డివిజన్ లోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, 25వ డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యి కోటంరెడ్డికి నిరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో తనకు అండగా ఉంటూ తనకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల కోసం గడచిన 9 ఏళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నానని, పార్టీలకు అతీతంగా తనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డిలా ఉండాని అని గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Reporter – P. Eswar