ఇండియా పేరు ఇకపై భారత్ : త్వరలోనే కేంద్రం తీర్మానం

Clock Of Nellore ( Delhi ) – ఇండియా పేరు మారనుందా ? ఇక నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా బదులు రిపబ్లిక్ ఆఫ్ భారత్ గా వ్యవహరించనున్నారా ? ఇకపై అన్నీ అధికారిక దస్త్రాలు, కార్యక్రమాలను భారత్ పేరుతోనే నిర్వహించనున్నారా ? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. జీ 20 సదస్సు ఆహ్వానితులకు రాష్ట్రపతి పంపిన లేఖల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. రాష్ట్రపతి లేఖల్లో ఇండియా బదులు భారత్ అని రాయడంపై రాజకీయ దుమారం చెలరేగింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ దిశగా తీర్మానం ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో జీ – 20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 9వ తేదీన విదేశీ అతిధులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విందు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఇలా చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాని మోడీ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

 

Reporter – Gopinath .K

Read Previous

చంద్రబాబు ద్వారానే భవిష్యత్తుకు గ్యారంటీ : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

నెల్లూరు డిఆర్వోగా లక్ష్మీ శివజ్యోతి : ప్రభుత్వం ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published.